49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేసింది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.

 

 

దీనితో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్ంగా 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుచుండగా 59,779 బ్యాలెట్ యూనిట్లను (BU) సిద్దం చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. మరోవైపు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను (VIS) అందజేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 3,26,02,799 స్లిప్‌లలో 1,65,32,040 మంది ఓటర్లకు పంపిణీ చేశారు, ఇది దాదాపు 51 శాతం. నవంబర్ 23 నాటికి మొత్తం స్లిప్సుల పంపిణీ పూర్తవుతుందని భావిస్తున్నారు.

 

రూ.632 కోట్లు స్వాధీనం..

ఎన్నికల సంఘం (ఈసీఐ) గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో రూ.632 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. వీటిలో మొత్తం నగదు స్వాధీనం రూ.236.35 కోట్లుగా ఉంది మద్యం విషయానికొస్తే, అక్టోబర్ 9, 2023 నుండి నవంబర్ 20, 2023 వరకురూ.101.57 కోట్లు. డ్రగ్స్/నార్కోటిక్స్ స్వాధీనంరూ. 35.06 కోట్లుగా ఉన్నాయి.విలువైన లోహాల స్వాధీనం రూ. 181.05 కోట్లకు చేరింది. బియ్యం, కుక్కర్లు, చీరలు, వాహనాలు, గడియారాలు, మొబైల్‌లు, ఫ్యాన్‌లు, కుట్టు మిషన్లు, అనుకరణ నగలు మరియు ఇతర వస్తువులను రూ.78.70 కోట్లకు మేరకు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద అక్టోబర్ 9, 2023 నుండి నవంబర్ 20, 2023 వరకు స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 6,32,74,73,364గా తేలింది.

Recent News :

Mohammed Rafee

Mohammed Rafee

Admin

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram