- బర్రెలక్క సోదరుడి పై దాడి
- దాడులకు భయపడను.
- ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన .
- సోషల్ మీడియాలో లక్షలాది మంది సపోర్ట్.
- ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివస్తున్న యువత.
నాగర్ కర్నూల్: తినడానికి తిండి కూడా సరిగ్గా లేని కుటుంబం…25 సంవత్సరాల నిరుద్యోగ యువతి …ఏకంగా నిరుద్యోగుల సమస్యలనే తన ఎజెండాగా చేసుకొని ఎమ్మేల్యే గా పోటీ చేస్తుంది.. ఏమిటి ఆ ధైర్యం..ఎవరిచ్చారు…ఇలాంటి ప్రశ్నలు కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల మేదల్లలో మెదులుతున్నాయి..నిరుద్యోగుల కోసం తాను వేసిన ఒక్క అడుగు లో వేల అడుగులు కలిశాయి.బుజం తట్టి బరోసా కల్పించాయి.తమకు తోచిన సహాయం అందిస్తూ కులం,మతం ,, ప్రాంతంతో సంబంధం లేకుండా సంఘీభావం తెలుపుతున్నారు. తమ సొంత ఖర్చులతో కొల్లాపూర్ చేరుకుంటున్నారు.బర్రెలక్క ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిద్దమని కొల్లాపూర్ కు బారులు తీరుతున్నారు యువత.ఎన్ని బెదిరింపులు వచ్చిన, అడ్డంకులు సృష్టించినా తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటూ శిరీష ముందుకు సాగుతున్న తీరు అద్భుతం.కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరి లో స్వతంత్ర అభ్యర్థిని గా పోటీ చేస్తున్న బర్రెలక్కకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.రోజు రోజుకు తెలంగాణ నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనూహ్య స్పందన వస్తుంది.సోషల్ మీడియా వేదికగా శిరీష కు అండగా నిలుస్తున్నారు. స్వచ్ఛందంగా యువత బర్రెలక్కకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.మేధావులు, ప్రజాస్వామిక వాదులు,నిరుద్యోగులు కొల్లాపూర్ లో అడుగు పెట్టీ ప్రచారం చేస్తున్న తీరు కొల్లాపూర్ ప్రజలను ఆలోచింపజేస్తుంది. బర్రెలక్క ఈలా గుర్తుకు ఎందుకు ఓటు వేయాలో మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు.స్థానిక ప్రజల నుంచి సైతం సానుకూల స్పందన రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు బర్రెలక్కకు లభిస్తున్న ఆదరణ చూసి.మంగళవారం పెద్ద కొత్తపల్లి మండలంలోని వెన్నచెర్ల గ్రామంలో శిరీష ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె సోదరుడు భరత్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు.దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.తన సోదరుడి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయాన్ని శిరీష ఆవేదనతో, ఏడుస్తూ తన పట్ల ఎందుకు ఎలా వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశ్నించింది. దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్ధానిక పొలీస్ స్టేషన్ ముందు ధర్నా కు దిగారు.మీడియా ద్వారా ఈ
దాడి సంఘటన తెలుసుకున్న ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శిరీష కు మద్దతు ప్రకటించారు. పోలీసులు వెంటనే శిరిషకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఈ సంఘటనపై స్పందించి స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.