నాగర్ కర్నూల్: కొల్లాపూర్ నియోజక వర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క ప్రచారం పై మంగళవారం జరిగిన దాడిని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో తీవ్రంగా ఖండించారు.దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయలని డిమాండ్ చేశారు.రాజకీయాలు కేవలం ఆధిపత్య వర్గాల వారే చేయాలా అని ప్రశ్నించారు.ఇంతకు ముందు శిరీష ఉద్యోగాలు రానందుకు బర్రెలు తీసుకుంటున్నా అని సోషల్ మీడియాలో వీడియో పెట్టిన కారణంగా పెద్దపల్లి పోలీస్ లు శిరీష పై కేసు పెడితే బహుజన సమాజ్ పార్టీ ఆమెకు మద్దతుగా నిలిచింది అని అన్నారు.అదే విధంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బర్రెలక్క ప్రచారం పై జరిగిన దాడిని ఖండించారు. ఇలా ఒక్కరు కాదు చాలా మంది శిరిషకు మద్దతు తెలుపుతూ కొల్లాపూర్ లో ఆమెకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.ప్రజల్లో సైతం శిరీష పట్ల సానుకూల స్పందన వస్తుంది.పోలింగ్ నాటికి పరిస్థితి లో ఎన్ని మార్పులు అయిన జరగ వచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.