కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిందని సీఎం కేసీఆర్ అన్నారు. జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. 1969 ఉద్యమంలో 400 మందిని కాంగ్రెస్ పొట్టన పెట్టుకుంది. 2004లో మనతో పొత్తు పెట్టుకుని మళ్లీ మోసం చేసింది. 2009లో నేను దీక్ష చేస్తే అప్పుడు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి ఇచ్చారు. సకల జనుల సమ్మె చేస్తే తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?.” అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Post Views: 16