కేసీఆర్ బక్కోడు కాదు. భూ బకాసురుడు: రేవంత్ రెడ్డి..

కేసీఆర్ బక్కోడు కాదు. భూ బకాసురుడు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం దుబ్బాకలో కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకకు కేసీఆర్ ఫ్యామిలీ పట్టిన శని అని అన్నారు. దుబ్బాకను బొందల గడ్డగా మార్చారని మండిపడ్డారు. ఉద్యమంలో గుర్తింపు రాగానే కేసీఆర్ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ రోజు వేల కోట్ల రూపాయలకు కేసీఆర్ కుటుంబం పడగెత్తిందన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram