భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 6 పీఎస్ఎల్‌వీలు, 3 జీఎస్ఎల్‌వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. రాజ్యసభ సమావేశంలో దీనిపై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
Post Views: 14