ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం.. సీఈసీకి ఫిర్యాదు…

ఆంద్రప్రదేశ్ రాజకీయం డిల్లీలో హాట్ హాట్ గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఆ వెంటనే బీజేపీ నాయకులు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో బోగస్ ఓట్లకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. పూర్తి ఆదారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు.

 

అమెరికా సర్వర్ లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారని విజయ సాయిరెడ్డి అన్నారు. పేర్లలో ఒక్క అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారన్నారని, తండ్రి పేరు,ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారని, పూర్తి ఆధారాలతో టీడీపీ పై ఫిర్యాదు చేశామన్నారు. ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76వేల 580 ఓట్లను ఒకే పోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేశారన్నారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిషాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని తెలిపారు. తక్షణమే సీఈసీ దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో మోసాలకు పాల్పడుతున్నారన బీజేపీ రాష్ట్ర నాయకురాలు పురందేశ్వరి ఆరోపించారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు సహా ఓటరు జాబితాకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram