అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సి.పి.ఆర్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్యం, అసోసియేట్ ప్రొఫెషర్ డాక్టర్ భూషణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ సౌజన్య మరియు జిల్లా పోలీస్ యూనిట్ ఆసుపత్రి డాక్టర్ వెంకటేశ్వర ప్రసాద్ లు పాల్గొని సి.పి.ఆర్ పై అవగాహన కల్పించారు.విధుల్లో ఉన్నప్పుడు పోలీసు సిబ్బందికే కాకుండా ప్రజలకు సైతం ఒక్కోసారి గుండె పోటు వచ్చి గుండె, ఊపిరితిత్తులు పని చేయకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయాలలో సిపిఆర్ పద్ధతి ద్వారా మళ్లీ ఈ అవయవాలు పని చేసేలా డెమో నిర్వహించారు. గుండెపోటు వచ్చిందని గుర్తించిన వెంటనే సదరు వ్యక్తి ఛాతిపై రెండు చేతులు ఉపయోగించి ప్రాణాలు ఎలా నిలపవచ్చో అవగాహన చేశారుసి.పి.ఆర్ పట్ల పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించిన వైద్యాధికారులను జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, రాముడు, ఆర్ ఎస్ ఐ లు రమేష్ నాయక్, మగ్బుల్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
