అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ చేసి రాయలసీమ ప్రాంతంలో ఉన్న జనాభా లెక్కల ప్రాతిపదికన అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మా రాయలసీమ వాటా ప్రకారం ఉద్యోగాల నియామాకాలను ఈ ప్రభుత్వం జరగకపోతే గతంలో (2014-19)మాదిరిగానే రాజధాని ఉద్యోగాలలో మా రాయలసీమ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయము జరుగుతుంది…కాబట్టి మన రాయలసీమ ప్రాంత జనాభా ప్రాతిపదికన మన రాయలసీమ వాటా ప్రకారం ఎన్ని ఉద్యోగాలు మన రాయలసీమ ప్రాంత ప్రజలకు వస్తాయో వాటిని ఈ ప్రభుత్వంతో సాధించాల్సిన భాద్యత మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలకు ఉందని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి గారు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను సవినయంగా కోరుతూ ఉన్నారు.
నోట్:: 4 జోన్ లో ఉన్న మన రాయలసీమ ప్రాంత ప్రస్తుత ఉద్యోగస్థులకు ప్రమోసన్స్ ,మరియు ఇతర విషయాలలో కూడా ఇతర జోన్స్ తో పోలిస్తే తీవ్రమైన అన్యాయము మన రాయలసీమ ప్రాంత ఉద్యోగస్థులకు జరుగుతోందని మీకు బాగా తెలుసు కాబట్టి అన్ని విషయములను మీ మీ సంఘాల నాయకుల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసికొని పోయి శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న మన కర్నూల్ లోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వినతిపత్రాలు సమర్పించాలని సవినయంగా కోరుతూ ఉన్నామ్..