విధి నిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబ సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని అదనపు ఎస్పీ అడ్మిన్ డి.వి.రమణమూర్తి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు శనివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో విధినిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో అదనపు ఎస్పీ అడ్మిన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలు(బెనిఫిట్స్), అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల గురించి, కుటుంబ స్ధితి గతులు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదనపు ఎస్పీ గారు మట్లాడుతూ మృతి చెందిన పోలీసు కుటుంబాల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిబ్బంది సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మరణించిన సిబ్బంది కుటుంబాలతో సమన్వయం చేసుకుని వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడు సహాయ, సహకారం అందిస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్బీ సి.ఐ లు ధరణీకిశోర్, క్రాంతికుమార్, ఆర్ ఐ మధు, ఆర్ ఎస్ ఐ రమేష్ నాయక్ , జిల్లా పోలీసు పరిపాలన కార్యాలయం ఏ.ఓ శంకర్, సూపరింటెండెంట్లు ప్రసాద్ , సావిత్రమ్మ & సిబ్బంది, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ ఎస్ ఐ జాఫర్, జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, లక్ష్మినారాయణ మరియు పోలీస్ అమర వీరుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.