కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనపై అధికారులతో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందేలా చూడాలని.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు.మరో వైపు జిల్లా SP హర్షవర్ధన్, ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
Post Views: 21