నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం…

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై చర్చించే అవకాశం ఉంది. ఆలయాల్లో పాలక మండలి నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram