రైల్వే సమస్యలపై సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ని మర్యాదపూర్వకంగా కలిసి రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బెంగళూరు ప్యాసింజర్ ని అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చిన కాపీని కూడా అందజేయడం జరిగింది. రైల్వే జనరల్ మేనేజర్ అతి త్వరలో ప్రారంభిస్తామని ఎంపీకి తెలియజేశారు.
రాజధాని ఎక్స్ప్రెస్ ను అనంతపురం స్టేషన్ నందు నిలుపుదలకు చేయుటకు ఎప్పుడు చేస్తున్నారని రైల్వే జీఎంని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే జనరల్ మేనేజర్ ని కోరి ఉన్నారు.
అనంతపురం రైల్వేస్టేషన్లోని లిఫ్ట్ పనులను పూర్తి చేయాలని ఎంపీ తెలియజేశారు. అలాగే అనంతపురం రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ ఆక్టివిటీస్ పై త్వరగా చర్యలు తీసుకోవాలని, పనులు పూర్తి చేయాలని కోరారు.
కిసాన్ రైల్ ను ప్రారంభించాలని కోరారు.
గతంలో ఇచ్చినటువంటి అనేక రైల్వే సమస్యలను సౌత్ సెంట్రల్ రైల్వే, జనరల్ మేనేజర్ దృష్టికి అనంతపురం ఎంపీ తీసుకెళ్లి, తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.