అనంతపురం వాల్మీకి సేవ దళ్ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య మాట్లాడుతూ.ఇటీవల అనంతపురం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ అంబిక లక్ష్మీనారాయ గారి గురించి పలు ఛానల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న, చేయిస్తున్న ఈ బులుగు మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు మీద ఎప్పుడు బురదజల్లడమే పనిగా పెట్టుకుందన్నారు.అనంతపురం చరిత్రలోనే కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని అందించిన అనంతపురం జిల్లా ప్రజలు, అంబికా లక్ష్మీనారాయణ గారి మీద అపారమైన నమ్మకంతో ఒక బడుగుబలహీన వర్గాలకు చెందిన బోయవాల్మీకి సామాజిక వర్గ నాయకుడ్ని తమ గుండెల్లో పెట్టుకున్నారు.అజాత శతృవుగా పేరుగాంచిన అంబికా లక్ష్మీనారాయణ గారు మొదటి నుండి ప్రజాసేవలో నిస్వార్థంగా నడిచే నేత,కొంతమంది కుటిల కుంచిత జ్ఞానం కలిగిన మీడియా ముసుగు కప్పుకొని వారికి తెలియదు అనుకుంటా అంబికా లక్ష్మీనారాయణ గారు 2018 లోనే టిడిపి హయాంలో (అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) AHUDA ఛైర్మన్ గా పనిచేశారని. అనంత పార్లమెంటు సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ గారు కార్యకర్తలకు, ప్రజలకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు, అంతేకాక పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సన్నిహితంగా మెలుగుతూ నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం లోక్ సభలో అనంత ప్రజల తరపున గళం వినిపించారు. ఏడు నియోజకవర్గాల ప్రజలకు కార్యకర్తలకు ఏ అవసరమొచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే దానికి స్పందించి పరిష్కరిస్తున్నారు. ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కావాలనే ఈ వైసిపి నాయకులు ఆయన మీద దుశ్ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారు.ఇంకొకసారి ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమే కాకుండా, టిడిపి పార్టీ తరపున బీసీ నాయకుడి పై ఉద్దేశ పూర్వకంగా అసత్య వార్తా కథనాలు ప్రసారం చేసినందుకు గాను చట్టపరంగా చర్యలు తీసుకోవల్సి వస్తుందన్నారు.వాల్మీకి సేవలల్ బుల్లెట్ లింగమయ్య పార్లమెంట్ అధ్యక్షుడు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు సూర్య ముని అంకిరెడ్డిపల్లి పుల్లన్న కొడుకు రామకృష్ణ.. తెలుగుదేశం సీనియర్ నాయకుడు. చాగల్లు సర్పంచ్ శంకర, పెద్దపప్పూరు మండలం నాయకుడు దేవేంద్ర,సురేషు. అశోకు, నారాయణస్వామి. ఈశ్వరయ్య,సోమలూరు కిట్ట, బైపాస్ శంకర్ ఖండించినారు.అంబికా లక్ష్మీనారాయణ అన్న జోలికొస్తే సహించేది లేదని బుల్లెట్ లింగమయ్య తెలియజేసారు.
