తాడిపత్రి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్ది

పార్టీ సభ్యత్వం కార్యకర్తకు తొలిమెట్టు అని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్ది అన్నారు.శనివారం తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తాడిపత్రిలో అయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి అండగా ఉంటున్న కార్యకర్తల కోసం వారి కుటుంబ సభ్యుల భరోసా కోసం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకున్న వారికి అయిదు లక్షల ప్రమాద బీమా,సాధారణ మరణానికి పది వేల రూపాయలు మట్టి ఖర్చుల కోసం ఇస్తారని విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుందని తెలియజేశారు. పార్టీ సభ్యత్వం కార్యకర్త కుటుంబానికి భరోసా అన్నారు. వార్డు,గ్రామాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్బంగా ఆయన కార్యకర్తకి సభ్యత్వం అందజేసి ప్రారంభించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram