28వ తేదీ అనగా సోమవారం రోజు గుంతకల్లులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ కు సంబంధించి గుంతకల్లు ఆర్డీవో కార్యాలయంలో ఈనెల 28వ తేదీన సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అలాగే అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు.