ఇకపై ఇరుముడితో విమాన ప్రయాణం..కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త తెలిపింది.భద్రతా సిబ్బంది స్కానింగ్ చేసిన తరువాత ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్లోనే ప్రయాణం చేయవచ్చని వెళ్లడించింది.భక్తుల వినతులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు సడలించామని ఇవాళ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు.మకర జ్యోతి (జనవరి 20వ తేదీ) వరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram