ఆర్మిడే సందర్భంగా వేణన్నకు ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు..

భారత సైన్యంలో పనిచేసేటప్పుడు శత్రువులను గడగడలాడించిన మాజీ భారత సైనికుడైన మన రాయలసీమ ముద్దు బిడ్డ కామని వేణుగోపాల్ రెడ్డి గారు తన కన్నతల్లి లాంటి మన రాయలసీమ ప్రాంత నీటి హక్కుల సాధన కోసం అలుపెరుగని ఎన్నో వీరోచిత మైన పోరాటాలు చేస్తూ ఏమి సాధించలేకపోతున్నానేమో అనే మనోవేదనతో ఈ మద్యనే మరణించడం జరిగింది. ఈ రోజు ఆయన స్వగ్రామంలో ఆర్మిడే సందర్భంగా పేరా ఫంక్షన్ హాల్ లో కామని వేణుగోపాల్ రెడ్డి గారి సంస్మరణ సభను ఏర్పాటు చేసి ఆయనకు రాయలసీమ ప్రాంత ప్రజలు, ఉద్యమకారులు మరియు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించడం అభినందనీయం.ఈ సందర్భంగా ఆయన పేరు మీద మన రాయలసీమ నీటి అధ్యయన కమిటీ వారు స్మ్రతి సంచికను సభలో ఆవిష్కరణ చేయడం అభినందనీయం ఆచరనీయం….

 

Facebook
WhatsApp
Twitter
Telegram