పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో చేపట్టనున్న ఈ టూర్ శనివారం నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు.
Post Views: 30