అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారని అంతర్జాతీయ మీడియ పేర్కొంది. ఇప్పటికే ఆయన 247 ఓట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ (270) వైపు దూసుకెళ్తున్నారు. స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ ఆధిపత్యంలో ఉండటంతో ఆయన గెలుపు లాంఛనమేనని తెలిపింది. కాగా, తదుపరి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. డెమొక్రటిక్ అభ్యర్థి 214 ఓట్లతో వెనుకంజలో ఉండగా, రిజల్ట్స్ పూర్తయ్యే వరకూ ఓటమిని ఒప్పుకోమని కమలా ఫాలోవర్స్ అంటున్నారు.
Post Views: 43









