భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కరకగూడెం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పలు దస్త్రాలను పరిశీలించారు. దస్త్రాల్లోని సమాచారం ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్సై రాజేందర్ ను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుండి ప్రజా సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదుల్లో జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా జరగకుండా నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలన్నారు…
Post Views: 72