బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, బైక్ ర్యాలీ

గోల్డెన్ న్యూస్ ,మణుగూరు

ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు

మణుగూరు మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా గురువారం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలి నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి పూల మార్కెట్, సురక్షా బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, lic కార్యాలయం నుండి పద్మశాలి భవనం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, ఆచార్య కొండా బాపూజీ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ విగ్రహాలకు పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, నవీన్, లక్ష్మణ్, రమేష్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram