ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకోవాలి.
కొత్తగూడెం గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం: ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పట్టణంలోని గ్రంథా లయ శాఖలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్స వాలను గురువారం ఆయన ప్రారంభించారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా జవ హర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించటంతో పాటు పుస్తక పఠనానికి వచ్చే వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెం పొందించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పలు వేషధారణల్లో ఉన్న విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రంథాలయ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.