భద్రాద్రి కొత్తగూడెం: కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. కరకగూడెం మండలం రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ ధర్మకర్త సారిక లింగయ్య ఆధ్వర్యంలో పుట్టలో పాలు పోసి పూజలు చేసి దీపాలు వెలిగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు.. సారలమ్మ గట్టు వద్ద స్నానాలు ఆచరించి దీపాలను భక్తులు నదిలో వదిలారు. గట్టు జాతరలో కార్తిక శోభ సంతరించుకుంది. జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పుట్టలో పాలు పోసి దీపాలు వెలిగించారు. తాడవాయి గ్రామానికి చెందిన మౌనిక, పవన్ ఆధ్వర్యంలో అయ్యప్పల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.దీంతో గట్టు భక్తులతో రద్దీగా మారింది..
Post Views: 70