మత్తుకు బానిసలు కావొద్దు

గోల్డెన్ న్యూస్ కరకగూడెం: మత్తు  పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణపై బట్టుపల్లి పాఠశాలలో విద్యార్థులకు కరకగూడెం ఎస్సై రాజేందర్ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మత్తు పదార్థాలు, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేశారు. పిల్లలకు పుస్తక పఠనం,యోగ, క్రీడలు, తదితర అంశాలపై మక్కువ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బట్టుపల్లి ప్రధానోపాధ్యాయులు మోహన్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram