ఛత్తీస్‌గఢ్ : దండకారణ్యం తుపాకుల మోతతో మళ్లీ దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం మేరకు, దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్‌జీ బృందం తనిఖీలు చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. భద్రతా దళాలపై నక్సల్స్ కాల్పులు జరిపగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలంలో ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Post Views: 35