హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించారు. పనులు ఏ మేరకు వెళుతున్నాయో అధికారులను సీఎం అడిగి తెలుసుకు న్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమం త్రి,ఆవిష్కరించనున్నారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఆగస్టు 28న సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ప్రకటన చేసిన రోజు.. సోనియాగాంధీ బర్త్డే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన… డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, గతం లోనే నిర్ణయించిన విషయం తెలిసిందే…
Post Views: 91