కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని కోల్పోయింది.

పార్టీ సీనియర్ నాయకుడిని  కోల్పోయింది- సీతక్క

పినపాక : కాంగ్రెస్ పార్టీ రోడ్డు ప్రమాదంలో సీనియర్ నాయకున్ని కోల్పోవడం బాధాకరమని పంచాయతీరాజ్, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం పినపాక మండలంలో ఆమె పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గట్ల శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. మృతుడు శ్రీనివాసరెడ్డి స్వగ్రామంకు వెళ్లి ఆయన మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. శ్రీనివాస రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram