కరకగూడెంలో సిపిఎం పార్టీ మహాసభ

సిపిఎం పార్టీ మహాసభలు అంటేనే ప్రజా సమస్యల ఎజెండా. 

 ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి.

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు.

గోల్డెన్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

కరకగూడెం మండలంలో సిపిఎం పార్టీ మూడో మహాసభ కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ కుంజ కృష్ణకుమారి ప్రాంగణంలో ఉకే నరసింహ రావు అధ్యక్షతన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని  అమరవీరులకు పూలతో జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ మహాసభలు అంటేనే ప్రజా సమస్యల ఎజెండా ఆరు గ్యారెంటీన్లు కచ్చితంగా అమలు చేయాలని ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలో సగం మాత్రమే అమలవుతున్నాయని మిగతా వాటిని ఎప్పుడు అమలు చేస్తారు తెలపాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. డిసెంబర్తో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వాగ్దానాల అమలుపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ.. మండలంలో పోడు భూములు పోరాటం ద్వారా రైతులుగా మార్చిన ఘనత సిపిఎంకే  దక్కుతుందని, పట్టాలు సాధించడంతో పాటు తునికి ఆకు బోనస్  త్రాగునీరు, రోడ్లు ఇతర మౌలిక వసతులు వలస ఆదివాసి గ్రామాల సమస్యలపై నిక్కచ్చిగా పోరాడిన పార్టీ సిపిఎం అని సిపిఎం పార్టీ మండలంలో ప్రజా పోరాటాలను విశిష్టపరిచాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు కొమరం కాంతారావు చర్మ సత్యం, బిలపాటి శంకరయ్య, కనితి రాము, కోవాసి వెంకటేశ్వర్లు, అడమయ్య ,పద్దం బాబురావు, తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram