అనారోగ్యంతో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని మృతిప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్ణక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు..
గోల్డెన్ న్యూస్, భూపాలపల్లి: మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన నిత్యశ్రీ(15) కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది.ఈ నెల 17న నిత్యశ్రీ అస్వస్థతకు గురి కాగా, తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి, తిరిగి హాస్టల్లో చేర్పించారు. తర్వాత విద్యార్థిని పరిస్థితి విషమంగా మారింది.21న నిత్యశ్రీ ఆరోగ్యం విషమంగా ఉందని ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు తెలపగా, వాళ్లు హన్మకొండ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.విద్యార్థిని పరిస్థితి విషమించే వరకు ఎందుకు తెలపలేదని.తమ కూతురి మరణానికి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్ణక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..