గోల్డెన్ న్యూస్ కరకగూడెం: సిపిఎం మండల కన్వీనర్ గా తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం కాంతారావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో ఆదివారం సిపిఎం పార్టీ మహాసభ నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతన కరకగూడెం మండల సిపిఎం పార్టీ కార్యదర్శిగా ఎన్నిక చేశారు. తన మీద నమ్మకం ఉంచి తనకు అన్నివిధాలుగా సహకరించిన మండల జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సిపిఎం నిబంధనలకు లోబడి రైతులు, కార్మికులు, ప్రజా సమస్యలపై కమిటీ సభ్యులను సమన్వయం చేసుకొని పోరాటాలు చేస్తామన్నారు.
Post Views: 28