గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం..కుళ్లిన కూరలు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
గోల్డెన్ న్యూస్ సంగారెడ్డి – కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పట్టిన అన్నం.. కుళ్లిపోయిన కూరగాయలతో వండిన కూరలు వడ్డించారు. ఆహారం దుర్వాసన రావటంతో విద్యార్థులు తినకుండా పారబోశారు. ఆదివారం సెలవురోజు కావడంతో తమ పిల్లల్ని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు.. ఆ ఆహారాన్ని పరిశీలించగా అన్నంలో పురుగులు కనిపించాయి. కూరలు దుర్వాసన వచ్చాయి. విద్యార్థులు ఉంటున్న వసతి గృహం కూడా చెత్తా చెదారంతో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిల్లలు తమ తల్లిదండ్రులతో చెప్పుకొని వాపోయారు. పరిస్థితులను చూసి ఆగ్రహించిన తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు..
Post Views: 29