ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు అరికట్టాలి

సీపీఐ ఎంఎల్ వరంగల్ జిల్లా నాయకులు మోడెం మల్లేశం

గోల్డెన్ న్యూస్ నర్సంపేట: రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ నేల రోజులు అవుతున్న నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఐ ఎంఎల్ వరంగల్ జిల్లా నాయకులు మోడెం మల్లేశం హాజరై మాట్లాడారు… వరి రైతులు ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని పంటను పండించి ధాన్యాన్ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లోని ప్రభుత్వ కొనుగోలు సెంటర్ కు తీసుకువచ్చి నెలరోజులు అవుతున్న ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.దీనికి తోడు దాన్యంలో తాలు డస్టు ఉందంటూ బస్తాకు మూడు కేజీలు అదనముగా కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంత బహిరంగంగా జరుగుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా ఉండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మార్కెట్ లో గత నెల రోజులుగా రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి నిరంతరం సంచరిస్తున్న పందుల నుండి రక్షణ తీసుకొని శ్రమ పడటం జరుగుతుందన్నారు. చివరికి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్న రైతుల ఆశలు అడియాశలవుతున్నాయని దీనితో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కటింగ్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అక్కడికి వచ్చిన నర్సంపేట తహసిల్దార్ ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎడ్ల ప్రతాపరెడ్డి వెంకన్న రమేష్ పూలక్కా పద్మ అరుణ విజయ రాజన్న రవి రాములు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram