రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న ఎస్ఐ

బోడు ఎస్సై పోలీ శెట్టి శ్రీకాంత్ కు తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్ ప్రశంసా పత్రం రివార్డ్ తో సత్కరించారు.

గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: మాదకద్రవ్యాల రవాణా, మత్తు పదార్థాల నియంత్రణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు ఎస్సై పోలిశెట్టి శ్రీకాంత్ కృషికి అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని, ప్రత్యేక రివార్డును అందుకున్నారు.2023 భద్రాచలం పిఎస్ పరిధిలో రెండు వేరు వేరు ఘటనలో 484 కేజీలు మరియు 480 కేజీల గంజాయి రవాణా చేస్తున్న నలుగురు ముద్దాయిని పట్టుకొని 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే విధంగా కోర్టుకు ఆధారాలు సమర్పించినందుకు గాను ఎస్సై ఈ రివార్డు అందుకున్నారు రివార్డు అందుకున్న ఎస్ఐ ను జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఇల్లెందు డిఎస్పి చంద్ర టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్ ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి సవాలుగా మారుతున్న మాదక ద్రావ్యాల రవాణా, వినియోగం, మత్తు పదార్థాల నియంత్రణకు ఎస్సై పొడిశెట్టి శ్రీకాంత్ బాధ్యతాయుతంగా కృషి చేశారు. ఇందులో భాగంగానే గంజాయి పట్టివేత కేసులో నేరస్థులకు 12 సంవత్సరాలు జైలు శిక్ష పడే విధంగా ఆయన కేసును సమర్థవంతంగా విచారణ చేపట్టారు. ఈ సమర్థతను గుర్తించిన రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారులు శనివారం హైదరాబాద్ లకిడికపూల్ లోని డిజిపి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పొడి శెట్టి శ్రీకాంత్ ను పోలీసు ఉన్నత అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఐపీఎస్, స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో సందీప్ శాండిల్య ఐపీఎస్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జయంతి తోపాటుగా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు, అశ్వరావుపేట, భద్రాచలం, పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు జిల్లా అధికారుల్లో చేతులమీదుగా ఎన్నో ప్రశంస పత్రాలు పొందినారు

Facebook
WhatsApp
Twitter
Telegram