బెదిరింపులకు బీఆర్ఎస్‌ పార్టీ భయపడదు..

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

గోల్డెన్ న్యూస్ కరకగూడెం: కుట్రలు చేసి,ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీని ఎదుగుదలను ఆపలేరని మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.గురువారం కరకగూడెం మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఏడాది కాకముందే నాయకులపై పెత్తనాలు చేయడమే కాకుండా,ప్రభుత్వంలొని కొందరు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నవారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే అదే సమయంలో సీఐ బయటకు వెళ్తున్నారు.ఇది గమనించిన కౌశిక్ రెడ్డి,ఆయన అనుచరులు సీఐ వాహనాన్ని అడ్డుకున్నారు.తన ఫిర్యాదు స్వీకరించి బయటకు వెళ్లాలని కౌశిక్ రెడ్డి సీఐ గారిని డిమాండ్ చేశారు.కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు.దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావు అనుచరులు,బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఇకనైనా కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని,అక్రమ కేసులకు భయపడేది వేదన  బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండె ధైర్యంతో ఉన్నారని ఉన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పాయం నరసింహారావు,కొమరం విశ్వనాథం,పొలెబోయన నరసింహారావు,కొమరం రాంబాబు,నిట్టా ఏడుకొండలు,రావుల కనకయ్య, కొంపెల్లి చిన్న రామలింగం,పులి శ్రీధర్,ఉకే నరేష్,సుర్యం తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram