ఏటూరునాగారంలో ఏడుగురు మావోయిస్టులకు గత నెల 30వ తేదీన పోలీసులే విషమిచ్చి అతికిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో పేర్కొంది. అనంతరం చిత్ర హింసలు పెట్టి హతమార్చినట్లు తెలిపింది. దీన్ని ఖండిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.
Post Views: 29