రోజు ఈత కొడితే ఊహించని ప్రయోజనాలు.

చలికాలంలో ఈతతో కీళ్లనొప్పులు మాయం.

చలికాలంలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో కీళ్ల నొప్పులు ఒకటి. వాతావరణంలో మార్పులు, తేమ శాతం పెరగడం, శరీరంలో విటమిన్ డి, విటమిన్ కె లోపించడం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయి. అయితే క్రీడాకారుల తోపాటు చాలా మంది రోజువారీ వ్యాయామాల్లో భాగంగా స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. పైగా చలికాలంలో స్విమ్మింగ్ చేయడంవల్ల కీళ్ల నొప్పులు దూరం అవడంతో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. నిపుణులు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .

కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు స్విమ్మింగ్ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా చలికా లంలో నొప్పులను తగ్గించడంలో ఇది అద్భతమైన వ్యాయామంగా పనిచే స్తుంది. ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించినా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఉప శమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే శరీరం మొత్తం రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది…

కండరాలు, కీళ్లకు ఆక్సిజన్, పోషకాల సరఫరా మెరుగుపడటంతో అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. కండరాలు దృఢంగా తయారవుతాయి. ఊపిరితిత్తులకు, గుండెకు చక్కటి వ్యాయామం అందుతుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయి. అధిక బరువు తగ్గాల నుకునే వారికి కూడా స్విమ్మింగ్  మంచి వ్యాయామం, హెల్త్ అండ్ ఫిట్నెస్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి చలికాలం లో, కీళ్ల నొప్పులు ఉన్నప్పటికీ స్విమ్మింగ్ చేయడంవల్ల మేలు జరుగుతుంది  నిపునుల అభిప్రాయం.

Facebook
WhatsApp
Twitter
Telegram