నలుగురిని అదుపులోకి తీసుకొని-రూ.6880,2 ధ్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్స్ స్వాదీనం.
గోల్డ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ మండలంలోని గోపతండం గ్రామ శివారులో పత్తి చేలో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు, సుజాత్ నగర్ పోలీసులు దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.6880,3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
నన్సావత్ అశోక్గు,గులోతు వినోద్ ,మాలోత్ రాకేష్ ,భూక్య భావ్ సింగ్, భూక్య సాయికుమార్ ( పరారీ లో ఉన్నాడు) వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సుజాతనగర్ మండలం ప్రజలు గ్రామాలు, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేక నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాాలకు పాల్పడినట్లయితే ఈ నెంబర్ ఫోన్ చేసి 8712682037 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో సుజాతనగర్ ఎస్సై మరియు సిబ్బంది పాల్గొన్నారు.