వింటర్లో గొంతు నొప్పితో బాధపడుతున్నారా.?

ఈ ఔషధం తీసుకుంటే  గొంతు నొప్పి తగ్గుతుంది.-వాతావరణ మార్పుల కారణంగా చలికాలంలో గొంతు నొప్పి సమస్య -ఆయుర్వేదం ఉపశమనం.?

చలికాలం వచ్చే వాతావరణ మార్పులతో చాలా మంది మంది జలుబు, దగ్గుతో పాటు గొంతు నొప్పి కూడా బాధపడుతుంటారు. వాతావరణంలోని మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్  గొంతులో తిష్ట వేసుకుంటాయి. ఫలితంగా గొంతంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. దీని మూలంగా తినడం, తాగడం కష్టమవుతుంది. కొందరు లాలాజలాన్ని కూడా మింగలేకపోతారు. కొన్ని సార్లు నొప్పికి తోడు జ్వరం కూడా వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, గొంతు బొంగురు పోవడం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభించేందుకు ఆయుర్వేద ప్రకారం ఓ ఔషధాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆయుర్వేదిక్  డాక్టర్ కుమారస్వామి. దానిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం వివరించారు..

కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లవంగాల చూర్ణం – 10 గ్రాములుతానికాయ పొడి -10 గ్రాములుమిరియాల పొడి – 10 గ్రాములుకాచు – 30 గ్రాములు తుమ్మ బెరడు చూర్ణం – 30 గ్రాములు నీళ్లు – పావు లీటర్లో మరిగించుకుని గోరువెచ్చ గా ఉన్నప్పుడు సేవించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

Note:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది…

Facebook
WhatsApp
Twitter
Telegram