కార్మిక శాఖ అధికారి నాగరాజు, కృషితో ప్రవేటు పాఠశాలలతో కుదిరిన ఒప్పందం
ప్రవేట్ పాఠశాల డ్రైవర్లు క్లీనర్లు హర్షం
గోల్డెన్ న్యూస్ మణుగూరు : మండలంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు, క్లీనర్లకు ఛట్టబద్ధమైన హక్కులను అమలు చేస్తామని మణుగూరు కార్మిక శాఖ అధికారి నాగరాజు అన్నారు.
మణుగూరు కు చెందిన సామాజిక సేవకులు కర్నే బాబురావు ఫిర్యాదు మేరకు లేబర్ ఇనస్పెక్టర్ ఎన్. నాగరాజు బుధవారం శివలింగాపురంలోని కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డితో కార్మిక శాఖ అధికారి నాగరాజు చర్చలు జరిపారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లకు మరియు క్లీనర్లకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్, వారాంతపు సెలవు, నెలకు రెండు , కార్మిక శాఖ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ జీవో అమలు చేస్తూ,పిఎఫ్ అమలు, 15 రోజుల గడువు లోపల అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు బాబురావు విలేకరులకు తెలిపారు..