గోల్డెన్ న్యూస్ పినపాక: మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల విద్యాశాఖ నాగయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, స్టోర్ రూం, పాఠశాల రికార్డులను, పాఠ్యాంశాల బోధన తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఉత్తమ బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ..
Post Views: 32