గోల్డెన్ న్యూస్ నిజామాబాద్: జిల్లా సముదాయం(కలెక్టరేట్)లోని పలు కార్యాలయాల ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి అధికారులు. పలు రికార్డులను పరిశీలించి, అధికారుల హాజరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, సంతృప్తికరంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఉన్నారు.
Post Views: 24