పురుగుల మందు సేవించి 108 ఉద్యోగి మృతి.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 108 వాహనంలో ఈఎంటి గా విధులు నిర్వహిస్తున్న కరకగూడెం మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన దోమల.ప్రణయ్ గత నెల 30 న పురుగుల మందు సేవించి ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియనియకుండా రెండు రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. డిసెంబర్ రెండవ తేదిన అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోని శబరిమలై వెళ్ళాడు అక్కడికి వెళ్ళినా తర్వాత ఆరోగ్యం క్షీణించి అస్వస్థతకు గురి కావడంతో. తోటి అయ్యప్పలు అక్కడ వైద్యం చేయించి తిరిగి విజయవాడ వచ్చేసరికి ప్రణయ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. సభ్యులకు సమాచారం అందించగా.కుటుంబ సభ్యులు ఖమ్మం లో ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సా పోందుతు గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు… ఇది ఇలా ఉండగా సహచర ఉద్యోగి వద్ద నుండి మృతుడు మధ్యవర్తిగా ఉండి ఒక్కరి,ఇద్దరు వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇప్పించి ఇప్పించినట్లు సమాచారం. మృతుడు ప్రణయ్ అయ్యప్ప స్వామి మాలదారణ ఉన్న సమయంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి అతని ద్విచక్ర వాహనం లాక్కున్నందుకు మన స్థాపానికి గురై పురుగుల మందు తగినట్లుగా సన్నిహితులు, స్నేహితులు అనుకుంటున్నారు.?

Facebook
WhatsApp
Twitter
Telegram