యువత క్రీడా స్ఫూర్తితో సాగాలి – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల.
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ప్రగతి మైదానం లో జరుగుతున్న సి.ఎం. కప్ జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవంలో కలెక్టర్ జితేష్.వి.పాటిల్, SP రోహిత్ రాజ్ లతో పాటు పాల్గొన్న కొత్వాల
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే. యువత క్రీడా స్ఫూర్తితో సాగాలని, తిరిగి విజయం కోసం ప్రయత్నించాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. సి.ఎం. కప్ – 2024 జిల్లా స్థాయి క్రీడలు నేటి నుండి 20 తేది వరకు కొనసాగనున్నాయి. కొత్తగూడెం ప్రగతి మైదాన లో సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్, SP రోహిత్ రాజ్, జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ మానవ జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని, శరీర దృఢత్వానికి మానసికోల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తాయని వారు అన్నారు. క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్న కలెక్టర్, ఎస్. పి కొత్వాల క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా జిల్లా కలెక్టర్ జితేష్.వి. పాటిల్, ఎస్. పి. రోహిత్ రాజ్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, కొత్వాల కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి, ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి. యుగంధర్ రెడ్డి, కె మహిధర్, వై. వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, జిల్లా కు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.