క్రీడాకారులను ప్రోచేహిస్తే సత్ఫలితాలు- జాతీయ స్థాయికి ఎదిగి జిల్లాకు వన్నె తేవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : గెలుపు, ఓటమిని క్రీడాకారులు సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, కొత్తగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా క్రీడాకారులకు సూచించారు. రామచంద్ర కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కబద్దిపోటీల్లో గెలుపొందిన క్రీడా జట్లకు షీల్డులు, ప్రశంశా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ విద్యాసంస్థలు, పాలకులు, విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు అందుతాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని అన్నారు. భద్రాద్రి జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదని, వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాష్ట్ర, జీతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబర్చి జిల్లాకు వన్నె తేవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులూ కొత్వాల శ్రీను, నాగా సీతారాములు, డిఎస్వో పరంధామిరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ అధక్షులు యుగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.