– ఎండోస్కోపీ చేసి బయటకు తీసిన రిమ్స్ వైద్యులు
తిరుపతి రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు బాలుడి కడుపులోని బ్యాటరీని తొలగించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తికి చెందిన ఓ బాలుడు ఇంట్లోని గుండ్రటి చిన్నపాటి బ్యాటరీ మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్విమ్స్‌కు తరలించారు. సర్జికల్ గ్యాస్టో ఎంట్రాలజ విభాగం వైద్యులు ఎక్స్‌రేలో పరిశీలించి ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకురావాలని, లేకపోతే ప్రాణాలకే హానీ అని వైద్యులు తెలిపారు.
Post Views: 21