గోల్డెన్ న్యూస్/తెలంగాణ సర్కార్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో కేటీఆర్ ను అరెస్టు చేయాలని పట్టుదలతో ఉన్నారు ఈ క్రమంలోనే తనని అరెస్టు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ పై కేసు కూడా నమోదు కావడం గమనార్హం.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కారు రేసుకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తనని అరెస్టు చేయడం కోసం తెలంగాణ సర్కార్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నారు అయితే గవర్నర్ ఈయన అరెస్టుకు గ్రీన్స్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ క్షణమైనా ఈయన అరెస్ట్ కావచ్చని అందరూ భావించారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయింది. ఫార్ములా-ఈ కార్ రేసు లో జరిగిన అవకతవలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసింది.ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్నది…