పార్సిల్ లో మృతదేహం – దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదారి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో విస్తుగొలిపే ఘటన చోటు చేసుకుంది. మహిళ మృతదేహం పార్సిల్ లో ఉండడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. మృతదేహాన్ని చూసి మహిళ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు..ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ ఇంటి నిర్మాణంకోసం క్షత్రియ సేవా సమితికి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో టైల్స్‌ అందజేశారు. అనంతరం మరోసారి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రెండో విడతలో విద్యుత్‌ సామాగ్రికి బదులు పార్శిల్‌లో మహిళ మృతదేహం వచ్చింది. అది చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Facebook
WhatsApp
Twitter
Telegram