సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్పి

అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాలి.

 పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్ ..

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్  జిల్లాలోని పోలీసు అధికారులతో గురువారం నేర సమీక్షా సమావేశాన్ని.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలు నందు సమావేశమయ్యారు.ముందుగా గత నెలలో వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు.ప్రజలు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.గంజాయి అక్రమ రవాణా,మట్కా,బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఐటీ సెల్ సీఐ నాగరాజు రెడ్డి మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram