గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు దోమల రమేష్ కు ఆర్థిక సహాయం అందజేసిన కరకగూడెం గ్రామీణ వైద్యుల సంఘం.. రమేష్ కుమార్ ప్రణయ్ ఇటీవల మృతి చెందాడు. మండలంలోని గ్రామీణ వైద్యులు శనివారం రమేష్ ను పరామర్శించి. మృతుడు ప్రణయ్ దశదినకర్మలకు 7వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, గౌరవ అధ్యక్షులు ఎస్.కె సోందు పాషా, సభ్యులు జి రామలింగేశ్వరరావు, మధ్యబోయిన రాజు, ఈసం కోటి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
Post Views: 55